విశాలాంధ్ర ధర్మవరం;; యోగివేమన అందరికీ ఆదర్శప్రాయుడని ఆర్డీవో మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో యోగివేమన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో తో పాటు కార్యాలయ అధికారులు సిబ్బంది చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆర్ డి ఓ మాట్లాడుతూ విశ్వ కవిగా యోగి వేమనకు ప్రపంచ గుర్తింపు ఉంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తాసిల్దార్ కార్యాలయంలో యోగివేమన వేడుకలు;; పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయంలో యోగివేమన వేడుకలు తాసిల్దార్ సురేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా తాసిల్దారు, కార్యాలయ అధికారులు, సిబ్బంది, చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మార్వో మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి యునెస్కో విభాగం ప్రపంచ భాష గొప్పకవులలో యోగివేమనకు మంచి గుర్తింపు రావడం జరిగిందన్నారు. నేటి యువతీ యువకులు యోగివేమనను ఆదర్శంగా తీసుకోవాలని, వారి అడుగుజాడల్లో నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


