మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పారిశుద్ధ్య విభాగం లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ సాయి కృష్ణకు మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ విభాగంలో అదరపు కార్మికులుగా 17 మంది, కరోనా కార్మికులుగా 50 మంది మొత్తం 87 మంది పని చేస్తున్నారని, కౌన్సిల్ తీర్మానం మేరకు జీతభత్ములు చెల్లింపులు, ఆప్కాస్ కింద పనిచేస్తూ చనిపోయిన కార్మికుల యొక్క కుటుంబంలోని వారికి ఉద్యోగం ఇవ్వాలని తీర్మానించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా ఈ విషయాన్ని కలెక్టర్ కు కూడా తెలియజేయడం జరిగిందని తెలిపారు. వారం రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు. ఈనెల 27వ తేదీ నుండి మున్సిపల్ కార్యాలయం ముందర దశలవారీగా ఆందోళన కార్యక్రమాలను చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అయూబ్ కాన్, కార్మిక సంఘం నాయకులు బాబు, ముకుంద, శ్రీనివాసులు, వెంకటేష్, చెన్నకేశవులు, సరోజమ్మ ,లక్ష్మీ ,వరలక్ష్మి పాల్గొన్నారు.
పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించండి..
- Advertisement -
RELATED ARTICLES


