Homeజిల్లాలుఅనంతపురంఇలినాస్ విశ్వవిద్యాలయంతో జేఎన్టీయూ చర్చలు

ఇలినాస్ విశ్వవిద్యాలయంతో జేఎన్టీయూ చర్చలు

- Advertisement -

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ : అమెరికాలో ఇలినాస్ విశ్వవిద్యాలయం అధికారులు ఆచార్య దేభాసిస్ దత్త , ఆచార్య శిఖాలకన్ పాల్ తో సమగ్రమైన, దీర్గ కాలిక విద్యా సంబంధిత బాగ స్వామ్యం అంశాలపై గురువారం పరిపాలన భవనంలో వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ కృష్ణయ్య డైరెక్టర్ అడ్మిషన్స్, ఫారిన్ అండ్ అల్యూమిని మేటర్స్ ఆచార్య ఎ. సురేష్ బాబు, డిఏపి డైరెక్టర్ ఆచార్య సత్యనారాయణ, అకాడమిక్ ఆడిట్ డైరెక్టర్ బి. దుర్గాప్రసాద్, డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉపకులపతి ఆచార్య హెచ్. సుదర్శన రావు మాట్లాడుతూ మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులలో విశ్వవిద్యాలయాల మధ్య భాగస్వామ్యం , ప్రస్తుత ఇండస్ట్రి అవసరాలకు అనుగుణంగా మన సిలబస్ రూపకల్పన చేయాలనీ సూచించారు. గౌరవ ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు దశా నిర్దేశం తో ఏపీలో క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా అబివృద్ది చెందుతున్నదని తెలిపారు.ఈ దిశగా (ఇలినాస్) విశ్వవిద్యాలయం తో భాగస్వామ్యం మన విద్యార్థులకు , అధ్యాపకులకు ఎనలేని మేలు జరుగుతుందని అన్నారు.భవిష్యత్ సాంకేతికతలకు మన విద్యార్థులకు అందించేందుకు అందులో నైపుణ్యం పెంపొందించేందుకు గల ఆవశ్యకతను విశదీకరించారు..రిజిస్ట్రార్ ఆచార్య ఎస్. కృష్ణయ్య మాట్లాడుతూ భవిష్యత్ సాంకేతికతలను విద్యార్థులకు చేరువు చేయడంలో జేఎన్టీయూ ఏ ముందజు లో ఉందని అన్నారు. తదనుగుణంగా ఈ విద్యా సంవత్సరం నుండి నూతన కోర్సులు కుడా ప్రారంబించడం జరిగినది. 3 + 1, 4 + 1 ఇలా పలు డిగ్రీ ప్రోగ్రాములు (ఇలినాస్) విశ్వవిద్యాలయ భాగస్వామ్యం తో రూపొందించుటకు సత్వర చర్యలు చేపడుతామని తెలిపారు. డి ఏ పి ఆచార్య ఎస్.వి. సత్యనారయణ మాట్లాడుతూ . జేఎన్టీయూ విశిష్టతలును సమగ్రమైన వివరణ సమర్పించారు. ఆచార్య దేభాసిస్ దత్తా గారు తన ఉపన్యాసంలో అధ్యాపక బృందం , ఇంస్ప్రా స్త్రచ్చర్ అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఉన్నాయని కొనియాడారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు