- Advertisement -
విశాలాంధ్ర- డుంబ్రిగుడ ( అల్లూరి జిల్లా):మారుమూల గిరిజన గ్రామాల్లో సాంకేతికతో అభివృద్ధి బాటకు కేంద్ర ప్రభుత్వం సెల్ టవర్ల నిర్మాణానికి మూడేళ్ల క్రితం చర్యలు చేపట్టింది. సెల్ టవర్లను నిర్మించినప్పటికీ, సెల్ సంకేతాల కల్పనకు ఇప్పటికి చర్యలు లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి గిరిజనులకు ఏర్పడింది. సాగర పంచాయతీ టికిలిబెడ్డ, వసబంద, కొయ్యమామిడి గ్రామాల్లో బీ. ఎస్. ఎన్.ఎల్ టవర్లను రెండేళ్ల కిందట నిర్మించారు. ఇప్పటికి సెల్ సంకేతల కల్పనకు నిర్లక్ష్యం వెంటాడుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సెల్ సంకేతలను కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు.


