ఎంపీడీఓ బి.విజయలక్ష్మి
విశాలాంధ్ర-రాప్తాడు :గ్రామాలను అందరూ సమన్వయంతో పరిశుభ్రంగా తీర్చిదిద్దుకుంటే అనారోగ్యాలు దరిచేరవని ఎంపీడీఓ బి.విజయలక్ష్మి సూచించారు. మరూరులో శనివారం స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ హై స్కూల్ ప్రాథమిక పాఠశాలలోని టాయిలెట్లను, మధ్యాహ్న భోజనం పథకం అమలును కూడా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యత, పరిశుభ్రత, వంటశాల నిర్వహణపై అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
అనంతరం గ్రామంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ కిట్లు పంపిణీ చేశారు. అలాగే స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలు, సిబ్బందితో కలిసి స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించి ర్యాలీ నిర్వహించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు అశోక్ బాబు అచ్యుతానంద బాబు, మండల కన్వీనర్ పంపు కొండప్ప, సొసైటీ చైర్మన్ మరూరు గోపాల్, హెచ్ఎం లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి విజయ్, వడ్లమూడీ కేశవ తదితరులు పాల్గొన్నారు.


