Homeజిల్లాలుఅనంతపురంక్రమశిక్షణ, నిరంతర కృషితోనే ఉన్నత శిఖరాలు

క్రమశిక్షణ, నిరంతర కృషితోనే ఉన్నత శిఖరాలు

- Advertisement -

పీవీకేకే కరస్పాండెంట్ డా. పల్లె రఘునాథ రెడ్డి

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: క్రమశిక్షణ, నిరంతర కృషితోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని శ్రీ బాలాజీ కరస్పాండెంట్ డా. పల్లె రఘునాథ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురంలోని పీవీకేకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో శనివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ‘ఆలుమ 2K26 అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిధ సంవత్సరాల్లో ఇక్కడ చదువుకుని, ప్రస్తుతం దేశ విదేశాల్లో ఉన్నత హోదాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులందరూ ఒక్కచోట చేరి తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని కళాశాల చైర్మన్ డా. పల్లె కిషోర్, కరస్పాండెంట్ డా. పల్లె రఘునాథ రెడ్డి, మేనేజ్మెంట్ ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి, ప్రిన్సిపాల్ డా. బండి రమేష్ బాబు, డీన్ డా. సంతోష్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ డా. పల్లె కిషోర్ మాట్లాడుతూ: “కళాశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థులే నిజమైన బ్రాండ్ అంబాసిడర్లు. మీరు సాధించే విజయాలే ఈ సంస్థకు గర్వకారణం. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటూ, మీరు చదివిన సంస్థ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పాలి. మీ అనుభవాలను ప్రస్తుత విద్యార్థులకు పంచుతూ వారికి మార్గదర్శకులుగా నిలవాలి” అని పిలుపునిచ్చారు.
కరస్పాండెంట్ డా. పల్లె రఘునాథ రెడ్డి విద్యార్థులకు సందేశమిస్తూ: “నేటి పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే కేవలం డిగ్రీలు ఉంటే సరిపోదు, నిరంతర అభ్యాసం, క్రమశిక్షణ అత్యంత అవసరం.పీవీకేకే సంస్థ ఎప్పుడూ నాణ్యమైన విద్యకు, నైతిక విలువలకు పెద్దపీట వేస్తుంది. ఇక్కడి నుండి వెళ్ళిన విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే గొప్ప వ్యక్తులుగా ఎదగడం చూడటం మాకు ఎంతో సంతోషాన్నిస్తుంది. జీవితంలో ఎంతటి ఉన్నత స్థానానికి ఎదిగినా మూలాలను మర్చిపోకూడదు” అని సూచించారు అనంతరం మేనేజ్మెంట్ ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్ బలోపేతం చేయడం లో ప్రస్తుత విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్ మరియు ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్‌లో ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ప్రిన్సిపాల్ డా. బండి రమేష్ బాబు, డీన్ డా. సంతోష్ రెడ్డి కళాశాల సాధిస్తున్న పురోగతిని వివరించారు.ఈ సమ్మేళనానికి భారీ సంఖ్యలో హాజరైన పూర్వ విద్యార్థులు తమ స్నేహితులు, అధ్యాపకులతో కలిసి సరదాగా గడిపారు. తమ విజయ ప్రస్థానంలో పీవీకేకే ఐటీ పోషించిన పాత్రను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు