Homeజిల్లాలుశ్రీ సత్యసాయిబాలికలకు భద్రత కల్పించడమే ధ్యేయం

బాలికలకు భద్రత కల్పించడమే ధ్యేయం

- Advertisement -

-శ్రీ సత్యసాయి జిల్లా మహిళా డిఎస్పి ఇందిరా.

విశాలాంధ్ర ధర్మవరం; బాలికలకు భద్రత కల్పించడమే మా ధ్యేయమని శ్రీ సత్యసాయి జిల్లా మహిళా డిఎస్పి, ధర్మవరం సబ్ డివిజన్ ఇంచార్జ్ డిఎస్పి ఇందిరా తెలిపారు. ఈ సందర్భంగా వారు బాలికల దినోత్సవం ను పురస్కరించుకొని పట్టణంలో జడ్పీ గర్ల్స్ హైస్కూల్, గర్ల్స్ కాలేజ్, వివిధ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థినీలతో పట్టణంలో పలు కూడలిల ద్వారా ర్యాలీని నిర్వహించారు. అనంతరం కాలేజీ సర్కిల్లో మానవహారాన్ని ఏర్పాటు చేశారు. తదుపరి వారు మాట్లాడుతూ నేటి సమాజంలో బాలికలపై దాడులు అధికంగా అవుతున్నాయని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా ఉంటాయని వారు తెలిపారు. బాలికల పట్ల మహిళల పట్ల గౌరవ మర్యాదలతో నడుచుకోవాలని తెలిపారు. ఇప్పటికే బాలికలకు మహిళలకు వారి భద్రత కొరకు అనేక చట్టాలు వచ్చాయని, ఆ చట్టాల మేరకే అందరికీ న్యాయం చేకూర్చడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ సునంద, దిశా సబ్ డివిజన్ శక్తి టీం రవీంద్ర నాయక్, గౌరీ సుకన్య తో పాటు మహిళా సాధిక్ శక్తి టీం సురేష్, సోమశేఖర్ ,సులోచన,వివిధ పాఠశాలలు కళాశాలల ప్రిన్సిపాల్, కరెస్పాండెంట్లు, విద్యార్థినీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు