లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆకులేటి రమేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు కంటి చికిత్స అందించడమే మా లక్ష్యము అని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఆకులేటి రమేష్ బాబు, కార్యదర్శి ఉలవల నాగేంద్ర, కోశాధికారి కొత్తపాలెం వెంకటేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణములో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని వారు నిర్వహించారు. అనంతరం అధ్యక్ష ,కార్యదర్శులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా వందలసంఖ్యలో శిబిరాలను నిర్వహించామని, వేల సంఖ్యలో పేద ప్రజలకు ఉచిత కంటి ఆపరేషన్లతో పాటు ఉచిత వసతి ఉచిత కంటి అద్దాలను కూడా పంపిణీ చేశామని తెలిపారు. నేటి ఈ కంటి చికిత్స శిబిరానికి లయన్స్ ఐ హాస్పిటల్ వారి సౌజన్యంతో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ముఖ్యఅతిథిగా జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ పోతుకుంట హెడ్మాస్టర్ గుడిపాటి గోపాలకృష్ణ హాజరు కావడం జరిగిందని తెలిపారు. అనంతరం ముఖ్యఅతిథిని ప్రభువారు ఘనంగా సత్కరించారు.ఈ శిబిరంలో 60 మంది పాల్గొనగా అందులో 30 మందికి ఉచిత కంటి శాస్త్ర సెకనులకు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోహన్ దాస్, గోసే రాధాకృష్ణ, వెంకటస్వామి, వేణుగోపాలచార్యులు, క్లబ్ టెక్నీషియన్ నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
వందలసంఖ్యలో ఉచిత కంటి చికిత్స శిబిరాలను నిర్వహించాము
- Advertisement -
RELATED ARTICLES


