అభినందించిన పాఠశాల హెచ్ఎం సుజాత
విశాలాంధ్ర ధర్మవరం: జాతీయస్థాయి జూడో పోటీలకు పట్టణంలోని జీవనజ్యోతి పాఠశాల విద్యార్థిని ఎన్. వైష్ణవి ఎంపిక కావడం జరిగిందని పాఠశాల హెడ్మాస్టర్ సిస్టర్ సుజాత తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న వెన్. వైష్ణవి నవంబర్ 28 నుండి 30 వరకు చిగిచెర్ల గ్రామంలో జరిగిన ఎస్ జి ఎఫ్ అండర్ 19 రాష్ట్రస్థాయి జూడో పోటీలలో మొదటి స్థానంలో నిలిచి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైందని వారు తెలిపారు. ఢిల్లీలో ఈనెల 30 వ తేది నుంచి ఫిబ్రవరి 3 వ తేది వరకు జరిగే జాతీయస్థాయి అండర్ 19 జూడో పోటీలలో పాల్గొంటుందని తెలియజేశారు ఎంపికైన విద్యార్థినిని పాఠశాల హెడ్ మిస్టర్స్ సిస్టర్ సుజాత కరస్పాండెంట్ సిస్టర్ రిసి ఉపాధ్యాయ, ఉపాధ్యాయినీ బృందం, తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు అభినందించారు.
జాతీయస్థాయి జూడో పోటీలకు జీవనజ్యోతి పాఠశాల విద్యార్థి
- Advertisement -
RELATED ARTICLES


