–ఎక్సైజ్ సీఐ చంద్రమణి
విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలోని రెండు మద్యం బార్ లకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు ఎక్సైజ్ చంద్రమణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రెండు మద్యం బార్లకు ఫిబ్రవరి 5 నుంచి ఆగస్టు 31/2028 వరకు లైసెన్స్ పొందడం కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ బార్లకు దరఖాస్తు చేసుకునేవారు జనవరి 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 6:00 వరకు అవకాశం ఉంటుందని తెలిపారు. దరఖాస్తుదారులు ఆన్లైన్, హైబ్రిడ్, ఆఫ్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వాటిని పుట్టపర్తిలో అందజేయాలని తెలిపారు. నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుము ఐదు లక్షలు లను ఆన్లైన్లో చెల్లిస్తూ, రాసేసింగ్ రుసుము పదివేల రూపాయల కూడా చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు ఎన్ని బార్లకైనా దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు. ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం 8 గంటలకు కలెక్టర్ ఆధ్వర్యంలో బార్లకు లైసెన్స్ దారులను లాటరీ ప్రక్రియ ద్వారా నిర్ణయిస్తామని తెలిపారు. ఇందుకు తప్పక ఎంట్రీ పాస్ కూడా పొందాలని తెలిపారు. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
మద్యం బార్ల రీ నోటిఫికేషన్స్
- Advertisement -
RELATED ARTICLES


