Homeజిల్లాలుకర్నూలుకల్తీ నెయ్యితో వైసీపీ నేతల జేబుల్లోకి కోట్లాది రూపాయలు

కల్తీ నెయ్యితో వైసీపీ నేతల జేబుల్లోకి కోట్లాది రూపాయలు

- Advertisement -

మంత్రాలయం సొసైటీ ఛైర్మన్ రామకృష్ణారెడ్డి, టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి విమర్శ

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) కల్తీనెయ్యితో వైసీపీ నేతలు కోట్లాది రూపాయలు జేబుల్లో నింపుకున్నారని మంత్రాలయం సొసైటీ ఛైర్మన్ రామకృష్ణారెడ్డి, టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి విమర్శించారు. గురువారం మండల పరిధిలోని బాపులదొడ్డి గ్రామంలో టీడీపీ నాయకులు నర్సిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూలో కల్తీనెయ్యికి నిరసనగా ఆంజనేయస్వామి దేవాలయాన్ని పసుపునీటితో శుభ్రం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా లడ్డూలో పామాయిల్, కెమికల్ కలిపిన ద్రవం, జంతువుల కొవ్వుతో దాదాపు 20 కోట్ల లడ్డూ ప్రసాదాలు తయారు చేశారని కల్తీనెయ్యి కేసులో సిట్ స్పష్టం చేసిందన్నారు . కల్తీనెయ్యితో వైసీపీ పెద్దలు 251 కోట్లను తమ జేబుల్లో నింపుకున్నారన్నారు. కల్తీనెయ్యి చేయలేదని, స్వామివారికి ద్రోహం చేయలేదని ప్రమాణం చేయగలరా అని వారు ప్రశ్నించారు. హిందూ సంప్రదాయాలను వైసీపీ నేతలు మంటగలిపారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తుంగభద్ర ప్రాజెక్టు చైర్మన్ టిప్పు సుల్తాన్, టీడీపీ సీనియర్ నాయకులు బసలదొడ్డి ఈరన్న, మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున, ప్రధాన కార్యదర్శి మొట్రు రామాంజనేయులు, సొసైటీ ఛైర్మన్లు మీసేవ ఆంజనేయులు, కందనాతి నరసప్ప, బీసీ సెల్ సాధికార సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లికార్జున, నాయకులు వీరేష్ గౌడ్, నరసింహులు, బిపి ఈరన్న, కేశవ, శ్రీరాములు, హనుమంతు, రామాంజనేయులు, మల్ధకల్, మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు