క్షమాపణ చెప్పిన ఆలయ కమిటీ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందరగల అతి పెద్ద చెట్లను ఆలయ కమిటీ లో గల శంకర సంజీవులు పూర్తిగా తొలగించాడు. ఈ సందర్భంగా అక్కడ పాత్రికేయులు, ప్రజలు ప్రశ్నించగా పొంతన లేని సమాధానాన్ని చెప్పారు. దీంతో అటవీశాఖ అధికారికి సమాచారం ఇవ్వగా, అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని ఇది చట్టరీత్యా నేరమని తెలిపారు. ఒక చెట్టు పెంచడం ఎంత కష్టమో, పెద్ద చెట్టును తొలగించడం కూడా అంత నేరమని తెలిపారు. అనంతరం ఆలయ కమిటీలో కార్యదర్శిగా ఉన్న దత్త శివ అక్కడకు చేరుకొని, శంకర సంజీవులకు తాను ఒకటి చెబితే మరొకటి చేశాడని, మందలించడం జరిగిందని తెలుపుతూ క్షమాపణ అడిగారు. ఫారెస్ట్ ఆఫీసర్లకు చలానా కడుతానని, తిరిగి చెట్ల పెంపకం చేపడతానని వారు తెలిపారు. శంకర సంజీవులకు చెట్లు పైకొమ్మలను తొలగించమని చెబితే పూర్తిగా చెట్లను తొలగించడం నిజంగా బాధాకరమని, పొరపాటు జరిగిందని వారు మరోసారి స్పష్టం చేశారు. స్థానికులు కూడా అక్కడి పెద్ద చెట్లను తొలగిస్తూ ఉంటే, అడిగితే శంకర సంజీవులు మండిపడడం ఎంతవరకు సమంజసమని తెలిపారు.
గుడి ముందర చెట్లు నరికివేత..
- Advertisement -
RELATED ARTICLES


