- Advertisement -
విశాలాంధ్ర- డుంబ్రిగుడ: ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా మండలంలోని కురిడి పంచాయితీ కేంద్రంలో స్థానిక యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్, జీరో అకౌంట్ పై కళాజాత ద్వారా బుధవారంఅవగాహన పరిచారు. ఈ సందర్భంగా కళాజాత నాటిక, పాటలు, రూపంలో సైబర్ క్రైమ్ వల్ల అనేకమంది ఎలా మోసపోయి నష్టపోతున్నారో వాటి అంశాలపై నాటిక ద్వారా గిరిజనులకు అవగాహన పరిచారు. అలాగే జీరో అకౌంట్ వల్ల ఉపయోగాలపై కూడా నాటిక ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ సిబ్బంది, కళాజాత బృందం శేఖర్, మోహన్ గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.


