Homeజిల్లాలుపార్వతీపురం మన్యంజిల్లాలో పారదర్శకంగా బార్ లైసెన్సుల కేటాయింపు : డిఆర్ఓ హేమలత

జిల్లాలో పారదర్శకంగా బార్ లైసెన్సుల కేటాయింపు : డిఆర్ఓ హేమలత

- Advertisement -

విశాలాంధ్ర,పార్వతీపురం : జిల్లాలో బార్ లైసెన్సుల కేటాయింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగిందని జిల్లా రెవిన్యూ అధికారి కె.హేమలత తెలిపారు. పార్వతీపురం, సాలూరు పట్టణాలకు చెందిన నాలుగు బార్ల కేటాయింపు ప్రక్రియ జిల్లా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో డీఆర్ఓ సమక్షంలో గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. డీఆర్ఓహేమలత డ్రా ద్వారా లాటరీని తీసి బహిరంగంగా దరఖాస్తుదారులకు చూపించారు.
ఈప్రక్రియలో 20మంది దరఖాస్తు చేసుకోగా, పార్వతీపురం పట్టణ పరిధిలోని మూడు బార్లను, సాలూరు పట్టణ పరిధిలో ఒక బారుకు డ్రా ద్వారా లైసెన్సులు కేటాయించారు. ఈకార్యక్రమంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ. సంతోష్, ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది, దరఖాస్తుదారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు