Homeజిల్లాలుశ్రీ సత్యసాయితక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి :ఎఐవైఎఫ్

తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి :ఎఐవైఎఫ్

- Advertisement -



విశాలాంధ్ర ధర్మవరం:రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని వివిధ ప్రభుత్వశాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్) రాష్ట్ర సమితి రాష్ట్ర వ్యాప్త నిరసనలకు అలాగే జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వలని పిలుపులో భాగంగా ఎఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ధర్మవరం ఆర్డీవో ఇన్చార్జి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భముగా సత్యసాయి జిల్లాఎఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సకల రాజా మాట్లాడుతూ
రానున్న అసెంబ్లీ సమావేశాలలో నిరుద్యోగ సమస్యపై చర్చించాలి అని, ఎన్నికల హామీమేరకు తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి అన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కూటమి పెద్దలు ఎన్నికల సమయంలో రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీలను అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే భర్తీ చేస్తాము అని, ప్రతి సంవత్సరము జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము అని, నిరుద్యోగ యువతకు శిక్షణ , ప్రోత్సహకాలు ఇచ్చి పారిశ్రామికవేత్తలు గా మారుస్తాము అని గల్లీబోలి మాటలు మాట్లాడడం సరైన కాదని తెలిపారు. అలాగే నిరుద్యోగ యువతకు 3000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాము అని హామీలు ఇచ్చిన అధికారంలోకి వచ్చి 19 నెలలు గడచినా ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోలేదని మండిపడ్డారు. స్పష్టమైన కార్యాచరణకు పూనుకోకుండా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని అఖిల భారత యువజన సమాఖ్యగా తీవ్రముగా ఖండిస్తున్నాము అని అన్నారు. ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ యువతకు 3000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలి ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన హామీ మేరకు న్యాయం చేయాలి వారు డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణ కార్యాచరణ ప్రకటించాకపోతే రాష్ట్ర వ్యాప్తముగా నిరుద్యోగ సమస్యపై పెద్ద ఎత్తున పోరాటానికి పూనుకుంటామని హెచ్చరించారు. తరువాత రాష్ట్రంలో వచ్చినటువంటి పెట్టుబడులు, తద్వారా నిరుద్యోగ యువతకు కలిగిన ఉద్యోగ ఉపాధి అవకాశాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యువజన సమాఖ్య నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు