విశాలాంధ్ర ధర్మవరం;;రిషి విద్యాలయాకి చెందిన విద్యార్థులు ఐఐటీ పోటీ పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. నిర్వహించిన పోటీ పరీక్షల్లో పలువురు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి సంస్థ ప్రతిష్టను మరింత పెంచారు.
గ్రేడ్ 6 నుండి గౌతమ్ లిఖిల్, సాత్విక్, సాత్విక్ నాగ, ప్రేరణ రెడ్డి, గగన్ గీత్ రెడ్డి, జతిన్ కుమార్ రెడ్డి మరియు గ్రేడ్ 7 నుండి మధు, ఆదిత్య సాయి, రితిక, శాలిని ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమంలో డీన్ భాస్కర్ రెడ్డి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల కృషి, పట్టుదల అభినందనీయమని ఆయన తెలిపారు.
ప్రిన్సిపాల్ కరణ్ స్వరూపా సింగ్ మాట్లాడుతూ, “విద్యార్థుల నిరంతర శ్రమ, ఉపాధ్యాయుల సమర్థమైన మార్గదర్శకత్వం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయి అని తెలిపారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత ర్యాంకులు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలి” అని ఆకాంక్షించారు.
వైస్ ప్రిన్సిపాల్ కళ్యాణి మాట్లాడుతూ, మన విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ లక్ష్య సాధన వైపు ముందుకు సాగుతున్న తీరు ఆనందంగా ఉంది అని అభినందించారు.
ఏ.ఓ. రంగారెడ్డి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. వారి విజయాలు పాఠశాలకు గౌరవాన్నితీసుకువచ్చాయని తెలిపారు.
ఐఐటీ పోటీ పరీక్షల్లో రిషి విద్యాలయ విద్యార్థుల ప్రతిభ
- Advertisement -
RELATED ARTICLES


