విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని కదిరి గేటు వద్ద గల శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో, పట్టణంలోని చక్రవర్తి థియేటర్ వద్ద గల కాలభైరవ ఆలయ వద్ద కూడా మహాశివరాత్రి పురస్కరించుకొని పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో గల మానస నృత్య కళా కేంద్రం వారిచే నృత్య ప్రదర్శనను గురువు మానస ఆధ్వర్యంలో నిర్వహించారు. మొత్తం 15 మంది చిన్నారులచే ఈ నృత్య ప్రదర్శన గావించారు. తదుపరి ఆలయ కమిటీ వారు వారు చేసిన నృత్యం పట్ల అభినందనలు తెలుపుతూ మెమొంటోలను బహుమతులను అందజేశారు. తదుపరి గురువు మానసను ఘనంగా సత్కరించారు. గురువు మానస మాట్లాడుతూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ఆలయ కమిటీ వారికి కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాట్య కళాకారుల తల్లిదండ్రులు, భక్తాదులు పాల్గొన్నారు.
అలరించిన నృత్య ప్రదర్శన.. గురువు మానస
- Advertisement -
RELATED ARTICLES


