Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅర్హులైన చేనేత కార్మికులందరికీ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలి…

అర్హులైన చేనేత కార్మికులందరికీ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలి…

- Advertisement -

ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ రమణ
విశాలాంధ్ర ధర్మవరం;!శ్రీ సత్య సాయి జిల్లాలోని అర్హులైన చేనేత కార్మికులకు అందరికీ 200 యూనిట్లు విద్యుత్తును అందించాలని ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ రమణ జేవి ,ఎ.ఖాదర భాష పట్టణ అధ్యక్షులు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే నెల నుంచి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించిన కూటమి ప్రభుత్వానికి చేనేత కార్మికులందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము అని, ముఖ్యంగా అనేక గ్రామాలలో, పట్టణాలలో 2 వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అందని వారికి మరొక్కసారి అవకాశం ఇచ్చి అందరికీ ఉచిత విద్యుత్ వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా బాడుగ ఇండ్లలో ఉన్న చేనేత కార్మికులకు ఇంటి ఓనర్లు పేర్లతో అగ్రిమెంటు బాండ్లను ఇవ్వాలనే కండిషన్ సరైనది కాదని తెలిపారు. ప్రభుత్వం పెట్టిన నియమ నిబంధనలు ప్రకారంప్రకారం బాడుగ ఇళ్ళ యజమానులు చాలామంది ఒప్పుకోరని, అందుకు బాడుగ ఇంటి లో ఉన్న చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్తు వర్తించడం లేదని, ప్రభుత్వం చేసే సహాయం ఎటువంటి కండిషన్లు లేకుండా అర్హులైన చేనేత కార్మికులకు ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును అందించాలని, చేనేత కార్మికులకు కనీస ఊరట కలిగించాలని, ముడి సరుకు వార్పు, సప్పూరి, జరి ధరలు విపరీతంగా పెరిగిపోయి, కార్మికులు నష్టాల ఊబిలో కూరుకు పోయారని, కరెంటు బిల్లులు సైతం కట్టలేని పరిస్థితిలో ఉన్న సమయమని ,కావున ప్రతి చేనేత కార్మిక ఇంటికి ఉచిత విద్యుత్ అందించాలని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు