ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో జనసేన పార్టీ విస్తరణపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ హైదరాబాద్‌లో నవ నిర్మాణ సభ నిర్వహించింది.ఈ సందర్భంగా సభలో పవన్ పాల్గొని మాట్లాడారు. అయితే, ఆ సభకు తెలంగాణ సర్కార్ అనుమతి నిరాకరించగా హైకోర్టులో సైతం జనసేన పార్టీకి చుక్కెదురైంది.
దీంతో పవన్ మంగళవారం సాయంత్రం తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి షాకింగ్ కామెంట్స్ చేశారు.
పవన్ బుధవారం ఉదయం ఓ ట్వీట్ చేశారు.తన ట్విటర్ ఖాతాలో ఆసక్తికర పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ప్రముఖ కవి శేషేంద్ర రచించిన కవితను పవన్ పోస్టు చేయడం విశేషం.అదే నా రాస్తా.. అంటూ పవన్ పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.
పవన్ పోస్ట్ చేసిన కవిత ఇదే..
ఏ రాస్తా యుద్ధాలు చేస్తుందో
ప్రాణాల్ని ఆటబంతుల్లా విసిరేస్తుందో గెలుస్తుందో
ఓడుతుందో కానీ ముందుకు పోతుందో అదే నా రాస్తా
ఏ రాస్తాలో సంకెళ్లు కూడా సవాల్ చేస్తాయో
ఏ రాస్తాలో అపజయం కూడా అగ్నిజ్వాలై మండుతుందో
ఏ రాస్తాలో మరణం మహాప్రబంధంగా
ప్రతిధ్వనిస్తుందో అదే నా రాస్తా…


