Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపక్కా గృహాల నిర్మాణంలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల జాబితాను తక్షణమే ప్రకటించాలి..

పక్కా గృహాల నిర్మాణంలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల జాబితాను తక్షణమే ప్రకటించాలి..

- Advertisement -

ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు
విశాలాంధ్ర ముదిగుబ్బ/ధర్మవరం;; ముదిగుబ్బ మండలంలో పక్కా గృహాల నిర్మాణంలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల జాబితాను తక్షణమే ప్రకటించి, ద్వారా పక్కా ఇళ్ల నిర్మాణాలను కూడా విని వెంటనే ప్రారంభించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ముదిగుబ్బా సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన పక్కా గృహాల నిర్మాణంలో భాగంగా ముదిగుబ్బ మండలానికి కూడా 2725 పక్కా ఇల్లు మంజూరైన నేపథ్యంలో మండల వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలు చాలామంది ఆరు నెలలు కిందటే పక్కా గృహాల కోసందరఖాస్తు చేయడం జరిగిందన్నారు, ఈ మేరకు దాదాపు రెండు నెలల కిందటే పక్కా ఇళ్ల అర్హుల జాబితా తయారైనానేటికీ హౌసింగ్ అధికారులు జాబితాను ప్రకటించకుండా గోప్యంగా ఉంచడంతోపాటు చేర్పులు, మార్పులు చేసి త్వరలోనే ఫైనల్ లిస్టు ప్రకటిస్తామని చెబుతుండడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన విమర్శించారు.ఏది ఏమైనా అర్హుల జాబితా సవరణ పేరుతో నిజమైన లబ్ధిదారుల పేర్లు తొలగించకుండా అర్హులైన వారందరికీ ఇల్లు మంజూరు చేయడంతో పాటు తక్షణమే పక్కా గృహాల నిర్మాణాలు ప్రారంభించడానికి కూడా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా సిపిఐ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో పక్క గృహాల నిర్మాణానికి నోచుకోని ఇల్లు లేని నిరుపేదలతో కలిసి త్వరలోనే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని సంబంధిత అధికారులకు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు