Homeఅంతర్జాతీయంఇరాన్ రాడార్ కేంద్రాలపై అమెరికా దాడి

ఇరాన్ రాడార్ కేంద్రాలపై అమెరికా దాడి

- Advertisement -

వాషింగ్టన్: సంఘర్షణను ముగించేందుకు అమెరికా`ఇరాన్ మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ…దాడులు మాత్రం ఆగడం లేదు. ఇరు దేశాల మధ్య మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. హోర్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ డ్రోన్‌లు ప్రయోగించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన అగ్రరాజ్యం…ఇరాన్‌కు చెందిన తీరప్రాంత నిఘా రాడార్ కేంద్రాలే లక్ష్యంగా దాడులు నిర్వహించింది. హోర్మూజ్‌లో నౌకల రవాణాకు ఇరాన్ డ్రోన్ దాడులు ముప్పుగా మారాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. తెహ్రాన్‌కు చెందిన నాలుగు డ్రోన్‌లను కూల్చివేశామని వెల్లడించింది. దీని తర్వాత గోరుఖ్, ఖేష్మ్ ద్వీపంలోని ఇరాన్ రాడార్ కేంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. మరిన్ని దాడుల నుంచి రక్షించుకోవడానికే ఈ చర్యలు చేపట్టినట్లు సెంటకామ్ తెలిపింది.
కువైట్ లక్ష్యంగా…ఇరాన్ ప్రతిదాడులు
ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. ప్రతిదాడులతో విరుచుకుపడుతోంది. కువైట్‌లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడింది. తమ గగనతలం పైకి దూసుకొచ్చే క్షిపణులు, డ్రోన్‌లను వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని కువైట్ తెలిపింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు