విశాలాంధ్ర- అనంతపురం టౌన్ : జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు ఏ.ఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా పర్యవేక్షణలో సోమవారం జిల్లాలోని పీఎస్ఓ (పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్)లుగా విధులు నిర్వహిస్తున్న గన్మెన్లకు స్థానిక జిల్లా శిక్షణా కేంద్రం (డీటీసీ ) నందు ప్రత్యేక రీఫ్రెష్ కోర్సులు ప్రారంభమయ్యాయి.ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏ.ఆర్. డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, ఆర్.ఐ. పవన్ కుమార్ అధికారికంగా ప్రారంభించి, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఏ.ఆర్. డీఎస్పీ మరియు ఆర్.ఐ. లు శిక్షణలో పాల్గొన్న పీఎస్ఓ (గన్మెన్)లకు పలు కీలక సూచనలు చేశారు:
విధి నిర్వహణలో క్షణకాలం కూడా అజాగ్రత్తగా ఉండకూడదని, విఐపిల భద్రత విషయంలో ఎల్లప్పుడూ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. తమకు కేటాయించిన ఆయుధాలను నిరంతరం శుభ్రంగా, సురక్షితంగా ఉంచుకోవాలని మరియు అత్యవసర సమయాల్లో వాటిని ఎలా ఉపయోగించాలనే అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. గన్మెన్లుగా పనిచేసే వారికి శారీరక సామర్థ్యంతో పాటు మానసిక ప్రశాంతత, సమయస్ఫూర్తి చాలా అవసరమని, ఈ రీఫ్రెష్ కోర్సు అందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. విధుల్లో ఉన్నప్పుడు క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా నడుచుకోవాలని స్పష్టం చేశారు.
ముఖ్య వ్యక్తుల రక్షణ బాధ్యత కలిగిన పీఎస్ఓల పాత్ర అత్యంత కీలకమైనది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మీ నైపుణ్యాలను, శారీరక దృఢత్వాన్ని మరింత పెంపొందించుకోవడానికే ఈ రీఫ్రెష్ కోర్సును ఏర్పాటు చేయడం జరిగింది. సిబ్బంది అందరూ ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఏ.ఆర్. డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి సూచించారు.
ఈ కార్యక్రమంలో డీటీసీ సిబ్బంది, జిల్లాలోని వివిధ విభాగాల నుండి వచ్చిన పీఎస్ఓ లు మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
పీఎస్ఓలకు రీఫ్రెష్ కోర్సులు ప్రారంభం
- Advertisement -


