Homeజిల్లాలుఅనంతపురందుర్గం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ..

దుర్గం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ..

- Advertisement -

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- మండల పరిధిలోని దుర్గం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మాజీ సర్పంచ్ సాకే రామాంజనేయులు విద్యా సామగ్రి పంపిణీ చేశారు. తన తండ్రి క్రీ.శే. సాకే పోతులయ్య జ్ఞాపకార్థం తన కుమారుల ద్వారా పెన్నులు, పెన్సిళ్లు మరియు ఇతర విద్యా సామగ్రిని విద్యార్థులకు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్య భవిష్యత్తును తీర్చిదిద్దే బలమైన ఆయుధమని అన్నారు. విద్యార్థుల అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సంజీవ రాయుడు, వెంకటేశ్వర్లు, ఇందిరమ్మ, రమేష్ రెడ్డి, కుటుంబ సభ్యులు కిరణ్ కుమార్, పెద్దక్క తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తాయని ఉపాధ్యాయులు, గ్రామస్తులు మాజీ సర్పంచ్ సాకే రామాంజనేయులను అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు