Homeజిల్లాలుకృష్ణగూడూరులో ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీ

గూడూరులో ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీ

- Advertisement -

అంగన్వాడి కార్యకర్తలపై ఆగ్రహం
విశాలాంధ్ర-గూడూరు: గూడూరు మండలం, గూడూరు మున్సిపాలిటీలో అంగన్వాడి కేంద్రాలు, పాఠశాలలు, చౌక దుకాణాలను ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత విజయ్ ప్రతాపరెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బుధవారం మండలంలోకి చేరుకున్న చైర్మన్కు మండల అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేసి చిన్నారుల హాజర పట్టిక, పోషకాహారం, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషన్ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రంలో కార్యకర్తలు నిబంధన ప్రకారం చిన్నారులకు భోజనం కల్పించడం లేదని, కేంద్రాల్లో పిల్లలు లేకపోయినప్పటికి తప్పుడు హాజర్లు వేస్తూ గుడ్లు, నూనె, వంట సరుకులను కాజేస్తున్నారని మండిపడ్డారు. నిబంధనలు ఉల్లంగించిన అంగన్వాడి 1,3 కేంద్రాల కార్యకర్తలకు మెమో జారి చేయాలని డిఎస్ఓ రాజా రఘువీర్కు ఫుడ్ కమిషన్ ఆదేశాలు ఇవ్వగా, 15 కేంద్రం కార్యకర్తను సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. మూడు నెలలుగా అంగన్వాడి కేంద్రాలను తనిఖీలు చేయని ఐసిడిఎస్ సూపర్వైజర్ ను క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అన్నారు. పట్టణంలోని ఒకటవ చౌక దుకాణంలో రేషన్ బియ్యం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన ఫుడ్ కమిషనర్ పంచనామ నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ఆరైని కోరారు. స్థానిక కేజీబీవీ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలను తనిఖీ చేసి మేను ప్రకారమే విద్యార్థులకు భోజనం అందించాలని వంట ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. ఫుడ్ కమిషన్ వెంట స్థానిక ఎమ్మార్వో వెంకటేష్ నాయక్ అసిస్టెంట్ సిడిపిఓ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు