. గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో ఎంతోమంది దాతలు గ్రంధాలయాభివృద్ధికి పాటుపడుతున్నారు. ఇందులో భాగంగా బలిజ హరిప్రసాద్‌ను పాఠకుల సమక్షంలో శాలువాతో ఘనంగా సత్కరించామని గ్రంధాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పాఠకుల అవసర నిమిత్తం 10 కుర్చీలను విరాళంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు వడ్డే వెంకట్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఉద్యోగుల పనితీరును, వివిధ రికార్డులను వారు పరిశీలించారు. వివిధ ప్రత్యేక పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను సకాలంలో పాఠకులకు సరఫరా చేసి అభ్యర్థుల అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. మాడ్రన్ లైబ్రరీగా తీర్చిదిద్దాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సిబ్బంది రాము, రమణ నాయక్, శివమ్మ, గంగాధర్, పాఠకులు పాల్గొన్నారు.
గ్రంథాలయ అభివృద్ధి దాతకు సత్కరణ
- Advertisement -
RELATED ARTICLES


