ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్
విశాలాంధ్ర ధర్మవరం;; నిర్మాణ ఆర్గనైజేషన్‌తో శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రిన్సిపాల్ కారణం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాన్యుఫాక్చరింగ్,ఐటీ , అనుబంధ రంగాలలో భారత దేశ యువతకు తర్ఫీదు ఇవ్వటానికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిర్మాణ్ ఆర్గనైజేషన్ వారితో పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డు నందు గల శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల ఈ విద్యాసంవత్సరం నుండి సంయుక్త భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నది అని తెలిపారు. కళాశాలలో నిర్మాణ్ సంస్థ మేనేజర్ ఆదర్శ్ ప్రిన్సిపాల్ కరణం హర్షవర్థన్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాలతో కలిసి గత రెండు సంవత్సరాలుగా తాము ప్రయాణిస్తున్నాము అని నేటి ఒప్పందంతో విద్యార్థులకు తాము సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, ఆప్టిట్యూడ్ ట్రైనింగ్ మరియు వివిధ రంగాల నందు తర్ఫీదు ఇవ్వటం జరుగుతుంది అని, అందులో ప్రతిభ కనబరచినవారు క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా వివిధ రంగాలలో ఉద్యోగాలు పొందుతారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇంచార్జి రమేష్, అకడమిక్ ఇంచార్జి కృష్ణయ్య, ప్లేస్మెంట్ ఆఫీసర్ జయకృష్ణ, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ శ్రీనివాసులు, నిర్మాణ్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
నిర్మాణ్ ఆర్గనైజేషన్ తో శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల ఒప్పందం..
- Advertisement -
RELATED ARTICLES


