Homeజాతీయం‘తెహల్కా’ తేజ్పాల్కుపదేళ్ల జైలు

‘తెహల్కా’ తేజ్పాల్కుపదేళ్ల జైలు

- Advertisement -

ముంబై: తెహల్కా మాజీ సంపాదకుడు తరుణ్ తేజ్పాల్కు బాంబే హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్పాల్కు పదేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధించింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని తేజ్పాల్ను ఆదేశించింది. 2013లో జూనియర్ సోద్యోగినిపై అత్యాచారం చేసిన కేసులో తేజ్పాల్ను దోషిగా తేల్చిన బాంబే హైకోర్టులో గోవా ధర్మాసనం… తాజాగా శిక్ష ఖరారు చేసింది. గతంలో ట్రయల్ కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించగా… ఆ తీర్పును హైకోర్టు రద్దు చేసింది. 2013లో గోవాలో జరిగిన థింక్ ఫెస్ట్ ఈవెంట్‌లో పాల్గొన్న సమయంలో హోటల్ ఎలివేటర్‌లో తేజ్పాల్ తనపై అత్యాచారం చేశారని బాధితురాలు ఆరోపించారు. దీంతో అదే ఏడాది నవంబరులో అతడిని అరెస్టు చేయగా… ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ కేసుపై 2017లో మాపులా ట్రయల్ కోర్టులో విచారణ ప్రారంభం కాగా… తేజ్పాల్ను నిర్దోషిగా తేలుస్తూ 2021లో న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దానిని గోవా ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసింది. ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. తీర్పు అనంతరం మెహతా మాట్లాడుతూ ‘తేజ్పాల్ను తక్షణమే అరెస్టు చేయాలి. బాధితురాలికి తండ్రి వయసులో ఉన్న అతడు ఈ నేరానికి పాల్పడ్డాడు. బాధితురాలు నిరాకరణను పట్టించుకోలేదు. ఒక అమ్మాయి వద్దంటే… దాని అర్థం వద్దనే. దీనిపై ఈ కోర్టు సమాజానికి గట్టి సందేశం ఇవ్వాలి’ అని మెహతా పేర్కొన్నారు. మరోవైపు, ఈ కేసులో తానే బాధితుడినని, కనికరం చూపించాలని పరిశోధక జర్నలిస్టు అయిన తేజ్పాల్ విచారణ సందర్భంగా కోర్టును కోరాడు. ‘ఇప్పుడు నా వయసు 62. నేనొక బాధితుడిని. నాకు భార్య ఉంది. ఇంతకుమించి నేను చెప్పడానికి ఏమీ లేదు. మేం అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దయచేసి నాపై కనికరం చూపండి. వాస్తవాలన్నీ రికార్డు చేసే ఉన్నాయి’ అని అభ్యర్థించాడు. అయితే, ఆయన వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది.
ఉమర్, షర్జీల్లా నేనూ బాధితుడినే
ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్, సురేంద్ర గాడ్లింగ్ లాగానే తానూ రాజకీయ కక్షసాధింపునకు గురయ్యానని తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ ఆవేదన వెలిబుచ్చారు. తెహల్కా పరిశోధనాత్మక కథనాల వల్ల కొందరి రాజకీయ ప్రయోజనాలకు నష్టం కలిగిందని, అందుకే తనపై కేసు పెట్టారని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తరుణ్ తేజ్పాల్ లైంగిక దాడి కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై కొందరు 13 ఏళ్లుగా ప్రతీకారంతో రగిలిపోతున్నారని తేజ్పాల్ ఆరోపిం చరు. ఈ కేసులో తనను పదిసార్లు నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసే ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, దీనిపై త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు