Homeజిల్లాలుఅనంతపురంబాల్య వివాహాలు, లింగ వివక్షపై అవగాహన

బాల్య వివాహాలు, లింగ వివక్షపై అవగాహన

- Advertisement -

విశాలాంధ్ర, ఉరవకొండ: ( అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలం రాకెట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్‌ వెంకటేష్‌ నాయక్‌ ఆధ్వర్యంలో గురువారం లింగ వివక్ష నిర్మూలన, బాల్య వివాహాలు, టీనేజ్‌ గర్భధారణపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ వెంకటేష్‌ నాయక్‌ మాట్లాడుతూ బాలికలకు 18 సంవత్సరాలు, బాలురకు 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేయాలని సూచించారు. అంతకంటే తక్కువ వయసులో వివాహం చేస్తే బాల్య వివాహాల నిరోధక చట్టం ప్రకారం శిక్షార్హులవుతారని తెలిపారు. బాల్య వివాహాల వల్ల చదువుకు దూరమై భవిష్యత్తులో అనేక శారీరక, మానసిక, సామాజిక, కుటుంబ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. చిన్న వయసులో గర్భధారణకు గురికావడం వల్ల తల్లి, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు. అబ్బాయి, అమ్మాయిని సమానంగా చూడాలని, లింగ వివక్షకు తావివ్వరాదని సూచించారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, ఆడశిశువు అని తెలిసినప్పుడు భ్రూణహత్యకు పాల్పడటం చట్టరీత్యా శిక్షార్హమైన నేరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు