Homeఎన్‌డీయే ఐక్యతే దేశానికి బలం

ఎన్‌డీయే ఐక్యతే దేశానికి బలం

- Advertisement -

నదులు అనుసంధానం మోదీతోనే సాధ్యం
అదే జరిగితే భారత్ అభివృద్ధి అన్స్టాపబుల్
వారణాసి-వాద్నగర్ సేవా సంకల్Î అభియాన్లో సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ‘రైట్ టైమ్.. రైట్ లీడర్ నరేంద్ర మోదీ. దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాదు.. దేశ ప్రయోజనాల కోసం ఆయనకు అండగా నిలవాలి. ఎన్‌డీఏ ఐక్యతే దేశానికి బలం’ అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానాన్ని, ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని వారణాసిలో నిర్వహించిన వారణాసి-వాద్నగర్ సేవా సంకల్Î అభియాన్ కార్యక్రమంలో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాశీ-వాద్నగర్ సేవా యాత్రలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న ప్రగతిని, సంక్షేమం నుంచి సాంకేతికత వరకు చోటుచేసుకున్న మార్పులను ఆయన వివరించారు. మోదీ నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఇక ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నటికీ మరువలేమని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… కాశీ పుణ్యక్షేత్రం నుంచి నరేంద్ర మోదీ మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారని… ఇక్కడి ప్రజలు వారణాసికి నేతను ఎన్నుకోవడమే కాకుండా దేశానికి ఓ లీడర్‌ను అందించారన్నారు. ఆయన నిరంతరం శ్రమిస్తూ భారత్ను అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరుస్తున్నారని కొనియాడారు. ప్రపంచం ముంగిట భారత్ ను తిరుగులేని శక్తిగా మోదీ నిలబెట్టారని ప్రశంసించారు. ఇటీవలే బ్రిక్స్‌ సదస్సును కూడా సమర్థవంతంగా నిర్వహించారన్నారు. వివిధ దేశాల అధినేతలు మన ప్రధాని నాయకత్వాన్ని ప్రశంసించారని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా దీటైన జవాబుతో శత్రువుకు దీటైన జవాబుతో భారత్ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. మోదీ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని… 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందుతున్నాయని చెప్పుకొచ్చారు. జేజేఎం, అమృత్, పీఎం కిసాన్ వంటి పథకాలను ప్రస్తావించారు. కరోనా సమయంలో 200 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేసేలా ప్రొత్సహించి దేశ ప్రజలను కాపాడడంతోపాటు, 101 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్లను ఉచితంగా సరఫరా చేసి మానవత్వాన్ని చాటుకున్నారన్నారు. ఆత్మనిర్భర్ భారత్, వోకల్ ఫర్ గ్లోబల్ ఇలాంటి విధానాలతో మేకిన్ ఇండియా కాన్సెప్ట్ బలోపేతం అయ్యేలా చేశారు. గతంలో డిఫెన్స్‌ పరికరాలను దిగుమతి చేసుకునేవాళ్లం.. కానీ ఇప్పుడు ఎగుమతి చేసే స్థాయికి చేరాం. టెక్నాలజీని పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్న ఏకైక ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమేనన్నారు. స్పేస్, డ్రోన్, క్వాంటం, సెమీ కండెక్టర్ టెక్నాలజీస్ వంటి వాటితో పాటు… రోబోటిక్స్ వంటి వాటిని ప్రధాని మోదీ అవగాహన చేసుకున్నారు. ప్రధాని దూరదృష్టితో 2.20 లక్షల స్టార్టప్ ల ద్వారా యువతే ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుకున్నారు. ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి యువత చేరారంటే మోదీ కృషే కారణమంటూ ప్రశంసలతో ముంచెత్తారు. దేశం మొత్తానికి ఒకే పవర్ గ్రిడ్ ఏర్పాటు చేసిన ఘనత కూడా ఆయనదే. వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. త్వరలో బుల్లెట్ ట్రైన్లు రాబోతున్నాయి. నదుల అనుసంధానం మాత్రమే ఇంకా పెండింగులో ఉంది. ఇది మోదీ ద్వారానే సాధ్యమవుతుంది. బ్రహ్మపుత్ర, గంగ, మహానది, కావేరి, గోదావరి నదులను అనుసంసంధానం చేస్తే భారత్ అభివృద్ధి ఇక అన్ స్టాపబుల్ అని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.త్రేతాయుగ దైవమైన శ్రీరాముని జన్మస్థలం అయోధ్యలో కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని భావిస్తున్నాం. వెంకన్న ఆలయ నిర్మాణానికి 10 ఎకరాలు కేటాయించాలని చంద్రబాబు యూపీ ముఖ్యమంత్రిని కోరారు. తొలుత కాశీ విశ్వనాథుడిని కేంద్ర మంత్రులు రాజ్ నాధ్ సింగ్, చిరాగ్ పాశ్వాన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు