- రూ.15,000 కోట్ల పెట్టుబడి
- 45 వేల మందికి ఉపాధి
- సీఎం సమక్షంలో ఎండీఎల్‌తో ఒప్పందం
ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ షిప్‌బిల్డింగ్, మెరైన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా అభివృద్ధి చేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది. దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ ఏర్పాటుకు మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ షిప్‌బిల్డింగ్, మెరైన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా అభివృద్ధి చేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది. దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ ఏర్పాటుకు మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో శుక్రవారం సచివాలయంలో ఎండీఎల్, ఏపీ మారిటైమ్ బోర్డు-విశాఖపట్నం పోర్టు అథారిటీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎస్పీవీ సంస్థ నేషనల్ షిప్‌బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్-రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఈ అవగాహన ఒప్పందం జరిగింది. దుగరాజపట్నంలో ఆధునిక గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ నిర్మాణం కోసం వచ్చే ఐదేళ్లలో ఎండీఎల్ రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో సుమారు 45,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. షిప్‌బిల్డింగ్‌తో పాటు అనుబంధ పరిశ్రమలు, మెరైన్ ఇంజినీరింగ్, లాజిస్టిక్స్, సర్వీసెస్ తదితర రంగాల్లో పెద్దఎత్తున ఉపాధి, పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.
ఏడాదికి 12 లక్షల టన్నుల సామర్థ్యం
ప్రతిపాదిత షిప్‌యార్డ్ ఏటా 12 లక్షల గ్రాస్ టన్నుల నౌకా నిర్మాణ సామర్థ్యంతో రూపుదిద్దుకోనుంది. భవిష్యత్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సామర్థ్యాన్ని మరింత విస్తరించేందుకు కూడా వీలు ఉంది. ట్యాంకర్లు, బల్క్ క్యారియర్లు, కంటైనర్ నౌకలు, ఎల్ఎన్జీ క్యారియర్లు, ఇతర భారీ ప్రత్యేక నౌకలను నిర్మించేలా ఈ షిప్‌యార్డ్‌ను అభివృద్ధి చేయనున్నారు. తద్వారా దేశీయ అవసరాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు నౌకలను నిర్మించే సామర్థ్యం రాష్ట్రానికి అందుబాటులోకి రానుంది. దుగరాజపట్నంలో షిప్‌బిల్డింగ్-కమ్-పోర్ట్ క్లస్టర్ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. టెక్నో-ఎకనామిక్ ఫీజ్ఙిలిటీ రిపోర్ట్ ప్రకారం షిప్‌బిల్డింగ్, షిప్ రిపేర్ యార్డ్‌కు రూ.29,254 కోట్లు, పోర్టు అభివృద్ధికి రూ.9,513 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ పోర్టును కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసేందుకు ఆమోదం తెలిపింది. షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌ను కేంద్ర ప్రభుత్వ షిప్ బిల్డింగ్ డెవలప్మెంట్ స్కీం కింద అభివృద్ధి చేయనున్నారు. ఈ క్లస్టర్‌కు మాజగాంవ్ డాక్ యార్డ్ లిమిటెడ్‌ను యాంకర్ షిప్‌యార్డ్‌గా ఎంపిక చేశారు. కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఎండీఎల్ సీఎండీ జగ్మోహన్, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ చైర్పర్సన్ జస్మీత్ సింగ్ బింద్రా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


