విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: లిక్కర్ కుంభకోణం, మద్యం రవాణా సబ్ కాంట్రాక్టుల వ్యవహారంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 11న విచారణకు హాజరుకావాలని ఇప్పటికే నోటీ సులు ఇచ్చామన్న ఈడీ అధికారులు… ఈ విషయాన్ని ఫోన్ ద్వారా కూడా అంబటి రాంబాబుకు తెలియజేసినట్లు తెలిపారు. ఐతే తనకు ఎలాంటి నోటీసులు అందలేదని అంబటి రాంబాబు ఈడీ అధికారులకు తెలిపినట్లు సమాచారం. దీనిపై స్పందించిన అధికారులు విచారణలో భాగంగా ఈడీ కార్యాలయానికి రావాలని అంబటి రాంబాబుకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును సిట్, ఈడీ అధికారులు విచారించి అరెస్ట్ చేశారు.
ఇది కక్షసాధింపే: అంబటి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు తెగబడుతోందని… ఇందులో భాగంగానే తనను లక్ష్యంగా చేసుకుని ఈడీ నోటీసుల పేరుతో వేధింపులకు పాల్పడుతోందని అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేశ్ కుట్రపూరితంగా వ్యవహరిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎలాంటి దర్యాప్తు సంస్థలను ప్రయోగించినా తాను బెదిరేది లేదని తేల్చిచెప్పారు.
అంబటికి ఈడీ నోటీసు
- Advertisement -
RELATED ARTICLES


