అమెరికా ఏకపక్ష చర్యలపై డి.రాజా ఆగ్రహం
న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం సుంకాలు విధించే బిల్లును అమెరికా కాంగ్రెస్ ఆమోదించడాన్ని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా తీవ్రంగా ఖండించారు. భారత్ తన ఇంధన అవసరాలకు అనుగుణంగా ఏ దేశం నుంచి చమురు కొనుగోలు చేయాలనే నిర్ణయాన్ని సార్వభౌమ దేశంగా తీసుకో గలదని స్పష్టంచేశారు. రష్యా చమురు కొనుగోలు చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే వ్యాఖ్యలు చేయడాన్ని ప్రస్తావిస్తూ ‘భారత్ ఏ దేశం నుంచి చమురు కొనుగోలు చేయాలో నిర్ణయించే అధికారం అమెరికా అధ్యక్షడికి ఎవరు ఇచ్చార’ని డి.రాజా ప్రశ్నించారు. ట్రంప్ బహరింగంగా భారత్‌ను వేధిస్తుంటే ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అమెరికా ఒత్తిళ్లకు సర్కారు లొంగిపోతుందా అంటూ ఎక్స్ మాధ్యమంగా ప్రశ్నించారు. భారత్ సార్వభౌమ దేశం కాదా! మన విదేశాంగ విధానం ఏమైంది? మన నిర్ణయాలు మనం తీసుకోలేమా! అంటూ దుయ్యబట్టారు. విదేశాంగ విధానం, ఇంధన భద్రత నిర్ణయాలలో ఇతరుల జోక్యం ఎందుÅ£ని ప్రశ్నించారు. దీనిపై మోదీ స్పష్టతివ్వాలని డిమాండ్ చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా దుందుడుకు చర్యలు అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన భద్రత, దేశాల సార్వభౌమ నిర్ణయాలపై ప్రభావం చూపే అంశమని డి.రాజా అన్నారు. ఏకపక్షంగా ప్రపంచ క్రమాన్ని మార్చే ప్రయత్నంగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యం, సార్వభౌమాధికారం ఉన్న ఏ దేశం దీనిని సమర్థించదని డి.రాజా స్పష్టం చేశారు. భారత్ ఎంపికలను శాసించేందుకు అమెరికాకు అధికారాలు ఎవరు ఇచ్చారంటూ ప్రశ్నించారు. తక్షణమే భారత్‌పై ఒత్తిళ్లు ఆపే దిశగా సర్కారు చర్యలు తీసుకోవాలని, మోదీ బహిరంగంగా స్పందించాలని డి.రాజా డిమాండ్ చేశారు.
మోదీ మౌనమెందుకు?
- Advertisement -


