విశాలాంధ్ర-తాడిపత్రి: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచడం వల్లే పర్యావరణ పరిరక్షించబడతాదని మున్సిపల్ కమిషనర్ సబ్బి శివరామకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని యల్లనూరు రోడ్డు బైపాస్ వద్ద ఉన్న ఎస్టిపి-టూ లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ సబ్బి శివరామకృష్ణ హాజరై మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ కొరకు మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే మున్సిపల్ భూగర్భ డ్రైనేజీ ఎస్టిపి-వన్, టు, వాటర్ ట్యాంకులు, మున్సిపల్ స్థలాల ప్రాంగణాలలో దాదాపు 2వేల మొక్కలు నాటుతున్నామన్నారు. అలాగే పట్టణంలో ఇంటి ముందర స్థలమున్న ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకున్న వారమవుతామన్నారు. కావున ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మునిసిపల్, సచివాలయ ఇంజనీరింగ్ సెక్షన్, ప్లానింగ్ సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.