చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;;సంగం డెయిరీ చైర్మన్ దూళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రస్తుత ఎల్నినో ప్రభావం వలన వర్షాలు పడక పశువులకు మేత లేక ఇబ్బంది పడుతున్న రైతులను దృష్టిలో ఉంచుకుని సంగం డెయిరీ కి పాలు పంపుతున్న రైతులకు సైలేజ్ గడ్డిని సబ్సిడీపై అందించారు. ధర్మవరం మండల పరిధిలో తుంపర్తి సమీపాన ఉన్న ధర్మవరం బిఎంసి పరిధిలో 25 టన్నుల సైలేజ్ గడ్డి ని 36 మంది రైతులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాయలసీమ జోనల్ మేనేజర్ వై పి. వెంకటేశ్వర్లు, ఉమ్మడి అనంతపురం జిల్లా జోనల్ మేనేజర్ రావి బాలాజీ, ధర్మవరం బిఎంసి మేనేజర్ కపాడం శేఖర్, సూపర్వైజర్లు బాలచంద్రారెడ్డి, వెంకటరమణ,శ్రీకాంత్, నరసింహులు, సంగం డైరీ రైతులు పాల్గొన్నారు
సంఘం డైరీ ఆధ్వర్యంలో పాడి రైతులకు సబ్సిడీతో సైలెజ్ గడ్డి పంపిణీ
- Advertisement -
RELATED ARTICLES


