Thursday, January 30, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమంత్రి పయ్యావులతో ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ భేటి

మంత్రి పయ్యావులతో ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ భేటి

జీడిపల్లి-పేరూరు కాలువతో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చ

పేరూరు కాలువ నిర్మాణానికి 200కోట్లు, భూసేకరణకు 51కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి

హంద్రీనీవా కాలువ లైనింగ్ కి బదులు వెడల్పు చేయాలన్న సునీత, శ్రీరామ్

అన్ని అంశాలపై సానుకూలంగా స్పందించిన పయ్యావులు

ముఖ్యమంత్రితో చర్చించి.. నిధులు కేటాయింపు చేస్తామని హామీ.

విశాలాంధ్ర ధర్మవరం;; డివిజన్ పరిధిలోని పేరూరు కాలువ నిర్మాణానికి భూసేకరణకు నిధులు కేటాయించాలని కోరుతూ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ తో వారు సమావేశమై, సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా వారు

ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తో భేటి అయ్యారు. అనంతపురంలోని పయ్యావుల నివాసానికి వెళ్లి.. పలు అంశాలపై చర్చించారు. ముందుగా ఎమ్మెల్యే సునీత అనంతపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో హంద్రీ-నీవా అధికారులతో సమావేశం నిర్వహించారు. జీడిపల్లి నుంచి పేరూరు ప్రాజెక్టుకు నీరందించే పనుల పురోగతి గురించి చర్చించారు. భూసేకరణ, కాలువలు, పంపు హౌస్ లు, రిజర్వాయర్ల నిర్మాణానికి అవసరమైన నిధుల గురించి తెలుసుకున్నారు. సమగ్రమైన సమాచారంతో ఎమ్మెల్యే సునీతతో పాటు పరిటాల శ్రీరామ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావులను కలిశారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను మంత్రికి వివరించారు. జీఓ నెంబర్ 59 ప్రకారం జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరు ప్రాజెక్ట్ వరకు 54కిలోమీటర్లు కాలువ తవ్వాల్సి ఉందన్నారు. గత ఐదేళ్లలో ఈ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. పెండింగ్ పనులు, 4 పంపు హౌస్ ల నిర్మాణాలతో పాటు పుట్టకనుమ, సోమరవాండ్లపల్లి ప్రాజెక్ట్ ల నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. ఇందులో భూసేకరణ జరగాల్సి ఉందన్నారు. పేరూరు ప్రాజెక్ట్ కాలువ త్రవ్వకం కోసం చేసిన 266 ఎకరాల భూ సేకరణ పరిహారం బిల్లులు 14కోట్లు సీఎఫ్ఎంఎస్ లు అప్ లోడ్ చేశారని.. నిధులు విడుదల చేయాల్సి ఉందన్నారు. కాలువ భూ సేకరణ కోసం 51 కోట్లు బడ్జెట్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సీఎఫ్ఎంఎస్ పోర్టల్లో భూసేకరణ, కాలువ నిర్మాణం పనుల బిల్స్ అప్లోడ్ చేయడానికి హోల్డ్ ను తీసివేయాలన్నారు. పేరూరు కాలువ పనులు చేపట్టడానికి 2వందల కోట్ల బడ్జెట్ కేటాయించి.. నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులకు సంబంధించి చర్చించారు. కాలువ లైనింగ్ పనులపై రైతుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని.. వీటిని పరిగణలోకి తీసుకోవాలన్నారు. లైనింగ్ బదులు కాలువ వెడల్పు చేయాలని రైతులు కోరుతున్నట్టు వివరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో లైనింగ్ చేయాల్సి వస్తే… కాలువ గట్లకు ఇరు వైపులా చేసి… క్రింది భాగం వదిలేయాలన్నారు. అలాగే నసనకోట ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలలో బాలికల జూనియర్ కాలేజీ మంజూరుకు ఫైనాన్సియల్ క్లియరెన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే సునీత, శ్రీరామ్ చెప్పిన అన్ని అంశాలపై మంత్రి పయ్యావుల సానుకూలంగా స్పందించారు. సీఎం చంద్రబాబుతో పాటు సంబంధిత అధికారులతో వీటిపై చర్చించి త్వరలోనే సానుకూలమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు