Friday, January 31, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పై చర్యలు గైకొనండి..

అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పై చర్యలు గైకొనండి..

ఏపీ ఎరుకల ప్రజా పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల సురేష్
విశాలాంధ్ర ధర్మవరం;; రొల్ల మండలంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల లోని ప్రిన్సిపాల్ పై వెంటనే చర్యలు గైకొనాలని ఏపీ ఎరుకుల ప్రజా పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికే కలంకంగా వచ్చేలాగా ప్రిన్సిపాల్ మైలారప్ప ప్రవర్తించారని తెలిపారు. అంతేకాకుండా గణతంత్ర దినోత్సవం రోజున అతనికి అవార్డు రావడం అదే రోజు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ మాంసంతో కూడిన పార్టీని పెట్టడం ఎంతవరకు సమంజసం? అని తెలిపారు. అంతేకాకుండా పాఠశాలలో కూడా విద్యార్థులకు చికెన్ బిర్యానీ చేయించడం దారుణమని తెలిపారు. కావున ఆ ప్రిన్సిపాల్ ని బాధ్యునిగా చేస్తూ శాఖపరమైన చర్యలు తీసుకొని అవార్డును రద్దు చేయాలని, ఈ విషయాన్ని డీఎస్ఓ దృష్టికి తీసుకొని వెళ్లినా కూడా చర్యలు తీసుకోకపోవడం దారుణమని తెలిపారు. పాఠశాలకు చికెన్ సరఫరా చేసే వెండర్ రామాంజనేయులు కాంట్రాక్టర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల జిల్లాలోని అన్ని ప్రజా సంఘాలు పాఠశాలను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. అంతేకాకుండా గుంతకల్ ఎమ్మెల్యే జయరాం పాత్రికేయులు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పాత్రికేయులు వార్తలు వాస్తవాలు లేకపోతే అందుకు తగ్గట్టుగా నిబంధనల ప్రకారం న్యాయస్థానాలను సంప్రదించాలి తప్ప, బెదిరింపు లు చేయరాదని తెలిపారు. కావున ఎమ్మెల్యే పాత్రికేయులకు బేసరత్తుగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు