Homeజిల్లాలుకర్నూలుతడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలి

తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలి

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి పంచాయతీ పారిశుధ్య సిబ్బందికి అందించడం ద్వారా గ్రామ పరిశుభ్రతకు సహకరించాలని రాష్ట్ర టీడీపీ రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని ఎస్సీ కాలనీలో శానిటేషన్ శాఖ సహకారంతో మంజూరైన చెత్తబుట్టలను ఈఓఆర్డీ జయరాముడు, పంచాయతీ కార్యదర్శి మంజునాథ్ ఆధ్వర్యంలో గృహిణులకు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరవ రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఇళ్లలో ఉన్న కూరగాయల వ్యర్థాలు, ఇతర తడి చెత్తను పంచాయతీకి అందజేసిన చెత్తబుట్టల్లో వేయాలని తెలిపారు. పొడి చెత్తను ప్రత్యేకంగా సంచుల్లో ఉంచి, పంచాయతీ చెత్త సేకరణ సిబ్బంది ఇంటింటికీ వచ్చినప్పుడు వారికి అందించాలని సూచించారు. చెత్తను రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడపడితే అక్కడ వేయకుండా నిర్దేశిత విధానంలో పారవేయాలని కోరారు.వేస్ట్ పేపర్లు, ప్లాస్టిక్ డబ్బాలు, కూల్‌డ్రింక్ డబ్బాలు, పాడైపోయిన కుర్చీలు తదితర పొడి వ్యర్థాలను ఒకచోట సేకరించి, ప్రతి వారం కాలనీలోకి వచ్చే పరిశుభ్రత రథానికి అందించాలని తెలిపారు. ఇళ్ల పరిశుభ్రతతో పాటు గ్రామ పరిసరాల పరిశుభ్రతకు కూడా ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ మీసేవ ఆంజనేయులు, టీడీపీ టౌన్ అధ్యక్షుడు మల్లికార్జున, ఎస్‌ఎంసీ చైర్మన్ బొగ్గుల ప్రభాకర్, టీడీపీ నాయకులు బొగ్గుల తిక్కన్న కార్తికేయ, రామన్న, డీలర్లు ఆశీర్వాదం, ఆదాము, జైపాల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు