Homeజిల్లాలుఅనంతపురంఅంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవం

అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవం

- Advertisement -

విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని వడ్లపాలెం, హరిజనవాడ-టు లో, ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో సోమవారం అంగన్వాడి వర్కర్స్ ఆధ్వర్యంలో అంగన్వాడి పోషణ మాసోత్సవం, అంగన్వాడి ఉత్సవం, గర్భవతికి శ్రీమంతోత్సవం, సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు జంగం రెడ్డి అంకారెడ్డి, రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ పివి. ప్రతాప్ రెడ్డి సీనియర్ నాయకుడు సింగరి లక్ష్మీనారాయణ, ఐసిడిఎస్ సూపర్వైజర్ లావణ్య, రామలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ జన్మదినం, మోడీ ప్రజా ప్రతినిధిగా 25 సంవత్సరాలు పూర్తి సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించాలన్నారు. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే పౌష్టికాహారాన్ని గర్భవతులు, బాలింతలు, కిశోర బాలికలు సంపూర్తిగా వినియోగించుకోవాలన్నారు. అనంతరం వడ్లపాలెంలోని అంగన్వాడి కేంద్రంలో గర్భవతికి శ్రీమంతోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రసూల్ బి, అంగన్వాడి వర్కర్స్ బి. సౌజన్య, ఏకే. లలిత, ఆర్. ప్రసన్న లక్ష్మి, మహేశ్వరి, సురేఖ, రామలక్ష్మి, చంద్రావతి, మాధురి, మాధవి, ఎం.ఎస్.కె. రసూల్ బి, అంగన్వాడి హెల్పర్ శ్రీలత పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు