Homeవ్యాపారంఏపీ తుఫాను బాధితులకు హెల్త్ అడ్వైజరీ జారీ చేసిన స్టార్ హెల్త్

ఏపీ తుఫాను బాధితులకు హెల్త్ అడ్వైజరీ జారీ చేసిన స్టార్ హెల్త్

- Advertisement -

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాన్నిఅర్నబ్, మురసు రూపంలో రెండు తుఫాన్లు వరుసగా తాకాయి. దీనితో తీవ్ర ప్రభావం పడిన, లేక ప్రభావం పడే అవకాశాలున్న జిల్లాల జాబితాలో ప్రకాశం (ఒంగోలు), నెల్లూరు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఎన్‌టీఆర్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం ఉన్నాయి. కోస్తా ప్రాంతాలవ్యాప్తంగా భారీ వర్షాలు, నీరు నిల్చిపోవడం, విద్యుత్ మరియు రవాణాపరమైన అంతరాయాలు ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి. అవే జిల్లాలను వరుసగా రెండు తుఫాన్లు ముంచెత్తడంతో నీరు నిల్చిపోవడం మరియు పారిశుధ్యంపరమైన సమస్యలు ఆరోగ్యాలకు ముప్పుగా పరిణమించనున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశపు అగ్రగామి ఆరోగ్య బీమా సంస్థల్లో ఒకటైన స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్‌ కంపెనీ, ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంత ప్రజలందరు భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని, అధికారిక ప్రభుత్వ సలహాలను పాటించాలని, వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. వర్షాలు తగ్గిన తర్వాత ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశాలు ఉన్నాయి. వర్షం ఒక్కసారి తగ్గాక రెండు, మూడు వారాల తర్వాత కలుషిత సరఫరా వ్యవస్థలు, ఓపెన్ స్టోరేజ్ల వల్ల టైఫాయిడ్, కలరా, హెపటైటిస్ ఎ, డయేరియాలాంటి వ్యాధులు ప్రబలవచ్చు. కంటైనర్లు, టెర్రస్‌పై నిలవ ఉండిపోయిన నీరు, డెంగ్యూ, మలేరియా కారక దోమలకు ఆవాసంగా మారవచ్చు. డాక్టర్లు అందుబాటులో లేకపోవచ్చు. ప్రజలు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే సత్వరం వైద్య సలహాలు పొందాలని స్టార్ హెల్త్ కోరుతోంది. స్టార్ హెల్త్ పాలసీదారులు టెలీకన్సల్టేషన్ ద్వారా రిమోట్‌గా డాకట్రును సంప్రదించవచ్చు. అలాగే డాకట్రు సిఫార్సు మీదట క్యాష్లెస్ హోమ్ హెల్త్ కేర్‌ను పొందవచ్చు. పాలసీదారులు కాని వారు ఉదయం 8 గం. నుంచి రాత్రి 8 గం. వరకు స్టార్ హెల్త్ యాప్ ద్వారా ఉచితంగా వర్చువల్ డాక్టర్ కన్సల్టేషన్లను బుక్ చేసుకోవచ్చు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు