Homeవ్యాపారంబాటా ఇండియా క్యూ2 ఫలితాల విడుదల

బాటా ఇండియా క్యూ2 ఫలితాల విడుదల

- Advertisement -

గురుగ్రామ్: భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన పాదరక్షల సంస్థ అయిన బాటా ఇండియా, సెప్టెంబర్ 30, 2026తో ముగిసిన తైమాసికానికి తన ఆర్థిక ఫలితాలను ఈరోజు ప్రకటించింది. ఈ సంవత్సరం పండుగ క్యాలెండర్ చాలావరకు క్యూ3కి వాయిదా పడినప్పటికీ, క్యూ2ఎఫ్‌వై26లోని రూ. 8,013 మిలియన్లతో పోలిస్తే 7.5% పైగా వృద్ధిని ప్రతిబింబిస్తూ, రూ. 8,618 మిలియన్ల ఆదాయాన్ని నివేదించింది. ఈ తైమాసికంలో పన్ను తర్వాత లాభం రూ. 180 మిలియన్లుగా ఉంది, గత సంవత్సరం ఇదే తైమాసికంలోని రూ. 138 మిలియన్లతో పోలిస్తే ఇది 31% పైగా వృద్ధిని సూచిస్తుంది. పెరిగిన ఏఎస్‌పి (ఏఎస్‌పీ) దీనికి దోహదపడింది. ఈ తైమాసికంలోని వన్ఆఫ్లలో లైసెన్స్‌ ఫీజులపై రూ. 100 కోట్ల నాన్క్యాష్ ఫారెక్స్‌ నష్టం కూడా ఉంది. కొనసాగుతున్న కరెన్సీ విలువ క్షీణత కారణంగా రూ. 30 మిలియన్లు, ఒకేసారి ఆస్తుల రైట్`ఆఫ్ కారణంగా రూ. 39 మిలియన్లు తగ్గాయి. ఈ తైమాసికంలో రూ. 3,213 మిలియన్ల మిగులు నిధులను ప్రత్యేక డివిడెండ్‌గా పంపిణీ చేయడం వల్ల ఇతర ఆదాయం రూ. 46 మిలియన్లు తగ్గింది. ఈ ఫలితాలపై వ్యాఖ్యానిస్తూ, అక్టోబర్ 1, 2026 నుండి బాధ్యతలు స్వీకరించిన బాటా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సంజయ్ ఎస్. రావు మాట్లాడుతూ, “తైమాసిక ప్రాతిపదికన, వృద్ధి వేగం వరుసగా నాలుగో తైమాసికంలోనూ కొనసాగింది. క్యూ2ఎఫ్వై27లో 7.5% పైగా టాప్లైన్ వృద్ధి, రిటైల్‌లో బలమైన ఎల్‌ఎఫ్‌ఎల్ అండ్ ఏఎస్‌పీ వృద్ధి, ఫ్రాంచైజీ, ఐ అండ్ డీ ఛానెళ్లలో రెండంకెల వృద్ధి నమోదయ్యాయని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు