ప్రిన్సిపాల్ పద్మశ్రీ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఏపీ మోడల్ స్కూల్ లో ఆరవ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ పద్మశ్రీ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క ఆరవ తరగతి ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 75 రూపాయలు, ఓసి, బీసీ విద్యార్థులకు 150 రూపాయలు పరీక్ష ఫీజు చెల్లించాలని తెలిపారు. దరఖాస్తులు ఈనెల 24వ తేదీ నుండి మార్చి 31 వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని వారు తెలిపారు. ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 10 గంటలనుండి 12 గంటల వరకు మా మోడల్ స్కూల్ లోనే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 7981171568కు గాని, 7799004659 గాని, 6305974274 కు గాని సంప్రదించాలని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఏపీ మోడల్ స్కూల్ ఆరవ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోండి..
RELATED ARTICLES