Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరం కళాకారిణికి ఘన సన్మానం

ధర్మవరం కళాకారిణికి ఘన సన్మానం

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన కళాకారిణి, రచయితగా అభివృద్ధి పథంలో ముందుకు వెళుతూ గిన్నిస్ బుక్ హోల్డర్ గా ఉన్న సోమిశెట్టి సరళ మరో సత్కారమును కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా తెనాలి లోని ఆర్ ఎల్ పేటలో గల కళ్యాణ మండపంలో పద్మశాలి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహించిన నాలుగవ వార్షికోత్సవ వేడుకలకు సోమిశెట్టి సరళ ను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచారు. రాష్ట్రంలో పదోన్నతి పొందిన, అవార్డులు స్వీకరించిన, పదవీ విరమణ చెందిన, నూతనంగా ఉద్యోగం పొందిన పద్మశాలి ఉద్యోగులకు అభినందన సత్కారంలో భాగంగా ధర్మవరం కళాకారిణి సోమిశెట్టి సరళను ఘనంగా సత్కరించడం జిల్లాకే మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సందర్భంగా పద్మశాలి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ సోమిశెట్టి సరళ కళాకారిణిగా, రచయితగా ఎంతో కృషి చేసిందని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ఆమె మంచి గుర్తింపు పొంది, ఎన్నో సత్కారాలు పొందడం నిజంగా గర్వించదగ్గ విషయమని వారు తెలిపారు. ఇటువంటి వారిని మా తెనాలి తరపున సత్కరించడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. సోమిశెట్టి సరళ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడం, జానపద గీతాలు, ఇతరత్రా నాట్య ప్రదర్శనలు చేయడంలో ఆమెకు ఆమె సాటి అని తెలిపారు. తదుపరి పివిడబ్ల్యూఏ అధ్యక్షులు శివరామకృష్ణ, అడిషనల్ కమిషనర్ ఐటీ శాఖ హైదరాబాద్ కోటేశ్వరి, రాయలసీమ యూనివర్సిటీ కర్నూల్ వైశాన్సులర్ వెంకట బసవరావు, ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఆర్థిక శాఖ డిప్యూటీ కార్యదర్శి రామతీర్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంఘం కన్వీనర్ నాగేశ్వరరావు, భూగర్భ జల వనరుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ విద్యాసాగర్ విజయవాడ వారి చేతుల మీదుగా ఘనంగా సోమిశెట్టి సరళను సత్కరిస్తూ జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ధర్మవరం కళాకారులు సోమిశెట్టి సరళకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు