Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసిపిఐ జిల్లా మహాసభలు విజయవంతం చేయండి..

సిపిఐ జిల్లా మహాసభలు విజయవంతం చేయండి..

- Advertisement -

పట్టణంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్న సిపిఐ నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం పట్టణంలో సిపిఐ జిల్లా రెండవ మహాసభలను జూలై 31వ తేదీ, ఆగస్టు 1వ తేదీ (రెండు రోజులపాటు) విజయవంతం చేసేందుకు సిపిఐ నాయకులు విశేష కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా గత కొన్ని రోజులుగా పట్టణంలోని 40 వార్డులలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, జింక చలపతి, రవికుమార్, వెంకటరమణ, వెంకటస్వామి తోపాటు సిపిఐ అనుబంధ సంస్థల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొని కరపత్రాలను పంచుతూ, ప్రజలను ఆహ్వానిస్తూ, జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల నుండి కూడా మంచి స్పందన రావడం జరుగుతుందని, ప్రజలు కూడా తమ దగ్గర ఉన్న డబ్బును కూడా విరాళంగా సిపిఐ నాయకులకు అందజేయడం మాకెంతో సంతోషాన్ని ఇస్తుందని తెలుపుతున్నారు. సిపిఐ అభిమానులు, దాతల ద్వారా కూడా విరాళాలు సేకరిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ జిల్లా మహాసభలో పట్టణంలోని వివిధ విభాగాల కార్మికుల సమస్యలు, పట్టణ ప్రజల సమస్యలు, చర్చించి, పోరాట దిశగా వెళ్లడం జరుగుతుందని, ప్రభుత్వానికి, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, సమస్యలను విన్నవించి పరిష్కరించే విధంగా తప్పక తాము కృషి చేస్తామని సిపిఐ నాయకులు స్పష్టం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు