Homeఆంధ్రప్రదేశ్కడియంలో అంగన్వాడీల మానవహారం.

కడియంలో అంగన్వాడీల మానవహారం.

- Advertisement -

విశాలాంధ్ర – కడియం : అంగన్వాడీల న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె బేబీరాణి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం సిఐటియు ఆధ్వర్యంలో కడియం దేవి చౌక్ సెంటర్లో అంగన్వాడీలు  మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కె బేబీరాణి మాట్లాడుతూ అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, ఎఫ్ఆర్ఎస్ రద్దుచేయాలని, మినీలను మెయిన్ వర్కర్లుగా మార్చుతూ జీవో ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చెయ్యాలని, గ్రాట్యూటీ జీఓలో మార్పులు చేయాలని తదితర సమస్యలు తీర్చాలని కోరుతూ ఆగస్టు 21వ తేదీని బ్లాక్ డేగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వెంటనే అంగన్వాడీ యూనియన్లను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాజానగరం ప్రాజెక్టు కార్యదర్శి వై సుజాత, కె ఏడుకొండలు, డి వెంకటలక్ష్మి, పి సుజాత, డి చంటి, సిహెచ్ నాగమణి, టి కుమారి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు