విశాలాంధ్ర – సీతానగరం: నిరక్షరాసులను అక్షరాస్యులుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యంగా అక్షర ఆంధ్రా కార్యక్రమం చేపట్టనుంది అని ఎంపిడిఓ ఎమ్ భారతి అన్నారు. గురువారం మండలంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ ఎమ్ భారతి ఆధ్వర్యంలో అక్షర ఆంధ్రా అమలు పై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ ఎమ్ భారతి మాట్లాడుతూ అక్షర ఆంధ్రా కార్యక్రమం ద్వారా నిరక్షరాసులను అక్షరాస్యులుగా తీర్చి దిద్దడానికి ప్రభుత్వం ఉల్లాస్ అనే కార్యక్రమము ముఖ్య ఉదేశ్యం అని అన్నారు.దీని ద్వారా 15 నుండి 59 సంవత్సరముల మధ్య వయస్సు లో చదువురాని వారిని గుర్తించటం జరిగినది. వీరికి10 మంది నిరక్షరాస్యులకు ఒక వాలంటీరును కేటాయించటం జరుగుతుంది. వాలంటీరులను గుర్తించి, వారు నిరక్షరాస్యులను మేప్ చేసుకొసుకోవాలి. ఈ కార్యక్రమం సెప్టెంబర్ నెల నుండి ప్రారంభం కానుంది. దీనిలో మన మండలంకు 3400 మందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మిర్తిపాడు ప్రభుత్వ పాఠశాల ఎచ్ ఎమ్ శ్రీనివాస్, ఏ పి ఎమ్ జిలానీ, వెలుగు సి.సి.లు, ఉపాధి హామీ పధకం టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.
నిరక్షరాసులను అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యం
- Advertisement -
RELATED ARTICLES


