విశాలాంధ్ర, కొవ్వూరు. టిడిపి ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా రైతులను ఆదుకునేందుకు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రకటించింది. దీనిలో భాగంగా కొవ్వూరు టిడిపి కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని స్థానిక ఎమ్మెల్యే 3 వెంకటేశ్వరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ చాగల్లు మీదుగా కొనసాగి కొవ్వూరు పట్టణంలోని పరిమి కళ్యాణ మండపానికి చేరుకుంది. ఈ సందర్భంగా కొవ్వూరు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎంపికైన నాదెళ్ల శ్రీరామ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎప్పుడు వెంకటేశ్వరరావు తో పాటు టూ మెన్ కమిటీ సభ్యులు జొన్నలగడ్డ చౌదరి, కంట మని రామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ సూరపనేని చిన్ని, అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు మద్దిపట్ల శివరామకృష్ణ, జిల్లా మాజీ కార్యదర్శి కెవికె రంగారావు లతోపాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
| ReplyForwardAdd reaction |


