Homeఆంధ్రప్రదేశ్అంగన్వాడీ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

అంగన్వాడీ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

- Advertisement -

విశాలాంధ్ర – సీతానగరం: అంగన్వాడీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అంటూ రెవెన్యూ, మండల ప్రజా పరిషత్ కార్యాలయల వద్ద నిరసన తెలిపారు. దీనిలో భాగంగా మా అంగన్వాడీ సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపిడిఓ భారతికి బుదవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షురాలు సుబ్బలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి, మినీలును మెయిన్ వర్కర్లు గామార్చుతూ జీవో ఇవ్వాలని, యాప్ లు కలిసి ఒక యాప్ గా మార్పుచేయాలని,  ఎఫ్ ఆర్ ఎస్  ఇన్, అవుట్ రద్దు చేయాలని, సెంటరు నిర్వహణకు ట్యాబుల్ ఇవ్వాలని 5జి నెట్ ఇవ్వాలని ప్రధాన మంత్రి మాతృ వందనం పధకం నీ కొత్తగా అంగన్వాడీలు అప్పగించరాదు. గ్రాడ్యుటి జీవోలో మార్పులు చేయాలని, హెల్పర్లు ప్రమోషన్ లకు గైడ్లైన్స్ రూపొందించాలని కోరారు. అలాగే వెంటనే అంగన్వాడీ యూనియన్స్ ను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు