Homeఆంధ్రప్రదేశ్గోదావరి వరద పై లంక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 

గోదావరి వరద పై లంక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 

- Advertisement -

విశాలాంధ్ర – సీతానగరం: పెరుగుతున్న గోదావరి నది వరద పై లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసిల్దార్ ఏ శ్రీనివాస్ తెలిపారు. గురువారం మండలంలో లంక గ్రామం అయనా ములకల్లంకలో తహసిల్దార్ శ్రీనివాస్ పర్యటించారు. దీనిలో భాగంగా లంక గ్రామ ప్రజలతో గోదావరి వరద పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద గణనీయంగా పెరుగుతుంది అని అన్నారు. ములకల్లంక గ్రామ ప్రజలకు ముందస్తు చర్యలలో బాగంగా తొర్రేడు ప్రభుత్వ పాఠశాలను పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు. కావున ప్రజలు పునరావాస కేంద్రంకు తరలి రావాలని కోరారు. అలాగే ఎస్ఐ డి రామ్ కుమార్ మాట్లాడుతూ ఏటిగట్టు గ్రామల ప్రజల గోదావరి ఉగ్రరూపం ప్రవహిస్తుండడం వలన ఎట్టి పరిస్థితుల్లోనే ప్రజల గోదావరి నదీ పరివాహ ప్రాంతానికి వెళ్లవద్దని హెచ్చరించారు. 

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు