Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఖైదీలకు వసతి సదుపాయాలు సక్రమంగా ఉండాలి..

ఖైదీలకు వసతి సదుపాయాలు సక్రమంగా ఉండాలి..

- Advertisement -

ఉమ్మడి జిల్లాల జడ్జి భీమారావు
విశాలాంధ్ర ధర్మవరం;; ఖైదీలకు వశతి సదుపాయాలు సక్రమంగా ఉండాలి అని పుట్టపర్తి, అనంతపురం జిల్లాల(ఉమ్మడి జిల్లా) జడ్జి భీమారావు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని సభ్యుల్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వారు వంటగది, ఖైదీల గది, సరుకుల నిల్వగది పరిశీలించారు. అనంతరం వివిధ రికార్డు రిజిస్టర్ను కూడా వారు తనిఖీ చేశారు. ఖైదీల గదులు, పరిసరాలు పరిశుభ్రత గా ఉండాలని సబ్జైలు చూపెట్టెంట్ శివప్రసాద్ను ఆదేశించారు. అనంతరం జిల్లా జడ్జి భీమారావు మాట్లాడుతూ క్షణికమైన ఆవేశంలో నేరాలు చేశారని, ఆ నేరాలను భవిష్యత్తులో చేయకుండా చట్ట పరిధిలోనే జీవిస్తూ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని మెలగాలని తెలిపారు. కాసేపు జడ్జి ఖైదీలతో నేరుగా మాట్లాడుతూ తమకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని వారు నేరుగా అడగడం జరిగిందన్నారు. తదుపరి ఖైదీలు భుజించే భోజనాన్ని కూడా వారు రుచి చూశారు. ఖైదీలందరూ కూడా సత్ప్రవర్తనతో మెలగాలని, దీంతో శిక్ష తగ్గింపు ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా ఖైదీలకు ఉచితంగా న్యాయవాదులను తమ సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతేకాకుండా ప్రతి నెల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఖైదీలకు వైద్య చికిత్సలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపట్టాలని జైలు సూపర్డెంట్ ను ఆదేశించారు. తదుపరి సబ్ జైలు ఆవరణంలో ఉన్న బావిని వారి చూసి, ఇది సబ్ జైల్లో అవసరం లేదని, నీటి సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పించింది కదా? కావున ఈ విషయమై తమరు హైకోర్టుకు పరిష్కరించే విధంగా ఒక వినతి పత్రాన్ని అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశులు, న్యాయవాదులు సుమలత ,బాలసుందరి, బిల్లే రవీంద్ర, జైలు సూపర్డెంట్ శివప్రసాద్, జైలు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు