విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : పెద్దకడబూరు-ఆదోని ప్రధాన రహదారి పనులను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ గురువారం రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మబ్బు ఆంజనేయ మాట్లాడుతూ రోడ్డు గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.నిధులు విడుదలైనా ఇంత వరకు రోడ్డు పనులు మొదలు పెట్టడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.అంతేకాకుండా గతంలో ఇప్పుడు ఉన్న కూటమి నాయకులే చేపలు పట్టిన సందర్బంగా ఎన్నో ఉన్నాయన్నారు . అప్పుడు రోడ్డు గుర్తుంది కానీ ఇప్పుడు రోడ్డు గుర్తు రావడం లేదని కూటమి నాయకులపై మండిపడ్డారు. తక్షణమే రహదారి పనులు చేపట్టాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఇస్మాయిల్, మండల సహాయ కార్యదర్శి దస్తగిరి,రైతు సంఘం నాయకులు విరేష్,రమేష్,మహాదేవ, నాగేష్,తదితరులు పాల్గొన్నారు.


